ఏప్రిల్ 27, 2016
నేను ఒక half sleeves చొక్కా వేస్కొన్నాను, దానికి రెండు buttons లేవు. ఎదురుగా ముగ్గురు అమ్మాయిలు కూర్చొని ఉన్నారు. అప్పుడు అర్థమయ్యింది అవి పెళ్ళిచూపులని (నాకు ఎవ్వరూ చెప్పలేదు) . ఇంతలో కాఫీ వచ్చింది. ఆ అమ్మాయి కొంచెం తాగి (అది నాకు రావాల్సిన కాఫీ) పక్కనున్న అమ్మాయికిచ్చింది. పక్కనున్న అమ్మాయి (నేను చూడటానికి వచ్చిన) కొంచెం తాగి చివరి అమ్మాయికిచ్చింది. చివరి అమ్మాయి తాగుతున్నపుడు, నేను ఎదురుగా (చివరగా అమ్మాయి) వున్న అమ్మాయి కాఫీ తీసుకొని తాగటం మొదలెట్టాను. ఆ అమ్మాయి (నేను చూడటానికి వచ్చిన) చిన్నగా నవ్వింది. నేను కూడా నవ్వాను.
కాసేపటికి...
నేను బయట నించొన్నాను. అమ్మాయి నాన్న గారు బయట వచ్చారు. ఆయన అడిగారు చొక్కా కి buttons ఎందుకు లేవు అని. నేను చూస్కోలేదని చెప్పాను. తరువాత జీతం ముప్పై వేలు వస్తుందా అని అడిగారు. నేను ఆ ప్రశ్న కి సమాధానం చెప్పాను. చాలా సంతోషించి అమ్మాయికి నేను నచ్చాను అని చెప్పారు.
No comments:
Post a Comment